Operation Sindhur
ఇది మనమందరం గర్వించదగ్గ సందర్భం: మోడీ By The Wire Editorial Team on May 7, 2025 తమ నిర్ధిష్ట లక్ష్యాలైన పాకిస్తాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద క్యాంపుల మీద తక్కువ సమయంలో ఖచ్చితమైన దాడులు చేసినందుకు గాను ప్రధాని నరేంద్రమోడీ సాయుధ దళాలకు అభినందనలు తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద క్యాంపులను లక్ష్యంగా చేసుకోని భారత సైనిక దళం దాడులను నిర్వహించింది. దీని మీద స్పందించిన ప్రధాని నరేంద్రమోడీ ఇది అందరు గర్వించదగిన సందర్భమని క్యాబినేట్ సమావేశంలో అన్నారు. నిర్దిష్టలక్ష్యాలైన తొమ్మిది ఉగ్రవాద క్యాంపుల మీద తక్కువ సమయంలో దాడులు నిర్వహించడంతో భద్రతా బలగాలకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. బాలాకోట్ తర్వాత చాలా విస్త్రృతమైన సరిహద్దు దాడులను కేవలం 25 నిమిషాలలో వేగంగా, సమన్వయ మెరుపు దాడులతో భారత ఆర్మీ నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పాకిస్తాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద ఆవాసాలను లక్ష్యంగా చేసుకుంది. నిషేధిత సంస్థలైన జైష్-ఏ- మొహమ్మద్, లష్కర్-ఏ-తైబా, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన 80 కంటే ఎక్కువ ఉగ్రవా...