Pahalgam terror attack - India, Pakistan relations.
Pahalgam terror attack - India, Pakistan relations. Rama Sundari · పహల్గావ్ లో దాడి జరగగానే ఇండియా ముందు సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సింధూ నదీ జలాల ఒప్పందం ఇండియా పాకిస్తాన్ ల మధ్య 1960లో జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. దాడికి బాధ్యత వహించాల్సిన వాళ్లు ఆ పని చేయకుండా పాకిస్తాన్ కు నీళ్లు ఆపేస్తామని చెబితే ముందు భారతదేశ సామూహిక ఆత్మ సంతృప్తి పడుతుంది. పిచ్చి జనాలు వీరంగాలు వేస్తూ ఉంటారు. ‘వేట మొదలైయ్యింది. చచ్చారు నా కొడుకులు’ అంటూ RTV లాంటి వేలాది యు ట్యూబు ఛానళ్లు వ్యూస్ కోసం కిందా మీదా పడతాయి. మనలో కూడా చాలమందిమి ముందు పనిలో పనిగా పాకిస్తాన్ ను ఖండించి పారేసి మన దేశభక్తిని చాటుకొన్నాం. కశ్మీర్ దాడులు జరిగినపుడల్లా పాకిస్తాన్ ను ఖండించటం మన సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని తూచా తప్పక పాటించాలి. మనకు చాలా షార్ట్ మెమొరీ కూడా. పుల్వామా గుర్తుకు రాదు. ఎప్పుడో 2019లో కదా జరిగింది. దానికి సంబంధించిన నిజాలు తరువాత నాలుగైదు ఏళ్ల దాకా బయటకు వస్తూనే ఉన్నా ఎక్కడ గుర్తు ఉంటుంది? పార్లమెంటు దాడి నాటకం ఆడించి, అఫ్జల్ గురున...