Posts

Showing posts from July, 2021

China warning to its enemies.

 మాతో పెట్టుకుంటే మటాషే : జిన్‌పింగ్ హెచ్చరిక Jul 1 2021 బీజింగ్ : చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆ దేశ శత్రువులను గట్టిగా హెచ్చరించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) వందేళ్ళ సంబరాల్లో ఆయన చాలా దూకుడుగా మాట్లాడారు. శత్రువులు చైనాకు హాని కలిగించేందుకు, పలుకుబడిని చూపించడానికి ప్రయత్నిస్తే, మహా ఉక్కు గోడకు ఢీకొన్నట్లేనని తెలిపారు. చైనా, తైవాన్ పునరేకీకరణకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. హాంగ్ కాంగ్ పరిస్థితులను ప్రస్తావిస్తూ, చైనా భద్రత, సార్వభౌమాధికారాలను కాపాడుతూ, హాంగ్ కాంగ్‌లో సాంఘిక సుస్థిరతను సాధిస్తామన్నారు.  ‘‘చైనీయులమైన మేము న్యాయాన్ని సమర్థించే ప్రజలం. బలంతో చేసే బెదిరింపులకు లొంగబోం. ఓ దేశంగా మేం గట్టి ఆత్మవిశ్వాసంతో సగర్వంగా నిలుస్తాం. ఏ ఇతర దేశ ప్రజలకు మేము హాని చేయలేదు, వారిని అణచివేయలేదు, వారిపై ఆధిపత్యం చలాయించలేదు. మేం ఎన్నటికీ అలా చేయబోం. అదే సమయంలో మమ్మల్ని అణగదొక్కడానికి, మాకు హాని చేయడానికి లేదా మాపై ఆధిపత్యం చలాయించడానికి ఏ విదేశీ శక్తికీ అవకాశం ఇవ్వబోం. ఎవరైనా అలా చేయడానికి ప్రయత్నిస్తే, 140 కోట్ల మందికిపైగా ఉన్న చైనీయులతో నిర్మితమైన మహా ఉక్కు గోడను తమంతట త...