మూడో పక్షం జోక్యం అనవసరమంటూ ట్రంప్‌కు డ్రాగన్ ఝలక్

మూడో పక్షం జోక్యం అనవసరమంటూ ట్రంప్‌కు డ్రాగన్ ఝలక్

బీజింగ్ : ఉన్నట్టుండి డ్రాగన్ అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ ట్రంప్‌కు ఝలక్ ఇచ్చింది. భారత్ - చైనా మధ్య తలెత్తిన సరిహద్దు సమస్యలో మూడో పక్షం జోక్యం అనవసరమని తేల్చి చెప్పింది. భారత్- చైనా మధ్య తలెత్తిన సరిహద్దు సమస్యకు మధ్యవర్తిత్వానికి రెడీగా ఉన్నానని ట్రంప్ ప్రకటనపై ప్రశ్నించగా చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ పై విధంగా తేల్చి చెప్పారు.

‘‘చైనా మరియు భారత్‌ మధ్య తలెత్తిన సరిహద్దు సంబంధ వివాదాల పరిష్కార మార్గాలున్నాయి. చర్చల మార్గాలు కూడా ఉన్నాయి. చర్చల ద్వారా, సంప్రదింపుల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునే సత్తా మాకుంది. మూడోపక్షం జోక్యం అనవసరం’’ అని జావో లిజియన్ స్పష్టం చేశారు.

‘భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో.. ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించాలని అమెరికా భావిస్తోంది’ అని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ మధ్యవర్తిత్వం వహించే సత్తా అమెరికాకు ఉందని, అలా చేయడానికి సిద్ధంగా కూడా ఉన్నామని ట్రంప్ చెప్పారు. కాగా, భారత్-చైనా సరిహద్దులో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించిన విషయం తెలిసిందే.

Comments

Popular posts from this blog

NSA Ajit Doval meets former Bangladesh PM Sheikh Hasina at Hindon Airbase

Deep State - USA & India

Green Party of the United States