కిమ్ జోంగ్ ఉన్ ఎవరు? ఉత్తర కొరియా పాలకుడు ఎలా అయ్యారు?

26 ఏప్రిల్ 2020
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Facebook దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Messenger దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Twitter దీనిని క్రింది వాటితో షేర్ చేయండి ఇమెయిల్ షేర్ చేయండి
Image copyrightREUTERS
చిత్రం శీర్షిక
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై రకరకాల వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆయన ఏప్రిల్ 15న తన తాత కిమ్ ఇల్ సుంగ్ పుట్టినరోజు వేడుకలకు హాజరు కాలేదు. ఏప్రిల్ 25న జరిగిన ఉత్తర కొరియా సైనిక స్థాపన దినోత్సవానికి కూడా హాజరు కాలేదు. దీంతో, కిమ్ ఆరోగ్యంపై ఊహాగానాలు మరింత పెరిగాయి.
ఇంతకీ ఎవరీ కిమ్ జోంగ్ ఉన్? ఆ పేరే ఒక సంచలనం. ఆయన ఏం చేసినా? ఏం మాట్లాడినా అంచనాలకు మించి సంచలనాలు సృష్టిస్తారు. కిమ్ 2011లో ఉత్తర కొరియా పాలకుడు కావడం కూడా ఓ సంచలనమే. చాలా తక్కువ రాజకీయ, సైనిక అనుభవంతో ఆయన పాలకుడయ్యారు.
ఉత్తర కొరియా మాజీ పాలకుడు, "ప్రియమైన నాయకుడు" కిమ్ జోంగ్ ఇల్ 2011 డిసెంబరు 17వ తేదీన మరణించారు. అప్పటికే తన చిన్నకొడుకైన కిమ్ జోంగ్ ఉన్‌ను తన వారసుడిగా తీర్చిదిద్దుతున్నారు.
తండ్రి మరణం తర్వాత కేవలం పదిహేను రోజుల్లోనే పార్టీ అధ్యక్షుడిగా, దేశ సైన్యాధిపతిగా నియమితులైన యువ కిమ్ తండ్రికి తగ్గ తనయుడని గుర్తింపు పొందారు.
అప్పట్నుంచి ఆయన ఉత్తర కొరియా ఆయుధ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లటంపై ఆసక్తి ప్రదర్శించారు. ఎన్నో అణ్వాయుధాలు, క్షిపణుల పరీక్షలకు ఆదేశాలిచ్చారు. అమెరికాతో చారిత్రాత్మక చర్చలు జరిపారు. దక్షిణ కొరియాతో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు చర్యలు తీసుకున్నారు.
శక్తిమంతుడైన తన మేనమామను ఉరితీయడం, తన సవతి సోదరుడి హత్య (ఈ హత్యకు ఆదేశాలిచ్చింది కిమ్ అని ప్రచారం)తో తనను తాను కరుడుగట్టిన వ్యక్తిలాగా చిత్రీకరించుకున్నారు.
ఉత్తర కొరియా క్యాలెండర్లలో కనిపించని కిమ్ పుట్టినరోజు
ఆ మహిళలే ఉత్తర కొరియా 'రహస్య ఆయుధాలు'!
Image copyrightAFP
చిత్రం శీర్షిక
కిమ్ జోంగ్ ఉన్ 11 ఏళ్లప్పుడు తీసిన ఫోటో
కిమ్ జోంగ్ ఇల్ ముగ్గురు కొడుకుల్లో అందరికంటే చిన్న కొడుకు కిమ్ జోంగ్ ఉన్. ఇల్ మూడో భార్య కో యోంగ్ హుయికి కిమ్ 1983 లేదా 1984 లో జన్మించారు.
తండ్రికి వారసుడిగా కిమ్ ఎదుగుతారని మొదట్లో ఎవరూ అనుకోలేదు.
అందరూ అతడి సవతి సోదరుడు కిమ్ జోంగ్ నామ్, లేదా సొంత అన్న కిమ్ జోంగ్ చోల్.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు వారసుడు అవుతారని విశ్లేషకులు అనుకున్నారు.
అయితే, కిమ్ జోంగ్ నామ్‌ను 2001 మేలో జపాన్ దేశం నుంచి బహిష్కరించడం, కింమ్ జోంగ్ చోల్‌కు ''మగతనం లేకపోవడం'' వంటి కారణాల వల్ల కిమ్‌కు అవకాశాలు మెరుగయ్యాయి.
వరుసగా అత్యున్నత స్థాయి రాజకీయ పదవులను అందుకుంటూ వస్తున్న కిమ్ తదుపరి వారసుడవుతారని విశ్లేషకులు భావించారు.
దక్షిణ కొరియాలో ‘ఉత్తర కొరియా ఇవాంకా’
ట్రంప్-కిమ్.. తిట్లలోనూ పోటాపోటీ
Image copyrightAFP
చిత్రం శీర్షిక
కిమ్ జోంగ్ ఉన్ స్విట్జర్లాండ్ లో చదువుకుంటున్నప్పటి ఫొటో
తన అన్నల్లాగే స్విట్జర్లాండ్‌లో చదువుకున్న కింగ్ జోంగ్ ఉన్ ఎప్పుడూ పాశ్చాత్య ప్రభావాలకు లొంగలేదు.
స్కూల్ లేకపోతే ఇంటికి వచ్చేసేవారు. ఉత్తర కొరియా రాయబారితో కలిసి భోజనం చేసేవారు.
అక్కడి నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో కిమ్ II సంగ్ మిలిటరీ యూనివర్సిటీలో చేరారని అంటారు.
కిమ్ జోంగ్ ఉన్ తల్లి కో యోంగ్ హుయి, కిమ్ జోంగ్ ఇల్‌కి ప్రియమైన భార్య. ఆమె తన చిన్న కుమారుడిని ''మార్నింగ్ స్టార్ కింగ్'' అని పిలిచేవారు.
2010 ఆగస్టులో కిమ్ జోంగ్ ఇల్ చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు, ఆయన వెంట కిమ్ జోంగ్ ఉన్ కూడా ఉన్నారని ఒక నివేదిక తెలిపింది. అప్పటికే చాలామంది తండ్రికి వారసుడు ఉన్ అని భావిస్తున్నారు. కిమ్ జోంగ్ ఇల్ మరణించినప్పుడు, అవన్నీ నిజమేనని తేలింది.
కిమ్‌కూ గడాఫీకి పట్టిన గతేనా?
ఉత్తర కొరియాలో ఎక్కువగా తినే స్నాక్స్ ఇవే!
Image copyrightKCNA
చిత్రం శీర్షిక
2017 జూలైలో ఒక బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం సందర్భంగా సంతోషంగా ఉన్న కిమ్ ఫొటోను ప్రభుత్వ మీడియా విడుదల చేసింది
Image copyrightKCNA
చిత్రం శీర్షిక
కిమ్ పారిశ్రామిక తనిఖీలు దేశీయ మీడియాకు ప్రధాన ఆకర్షణ అయ్యేవి
మొదటి బహిరంగ ప్రసంగం
ఉత్తర కొరియా తన వ్యవస్థాపకుడు కిమ్ II సంగ్ 100వ జయంతిని జరుపుకుంటున్న సందర్భంగా 15 ఏప్రిల్ 2012న కిమ్ జోంగ్ ఉన్ మొదటిసారి బహిరంగ ప్రసంగం చేశారు.
"మిలిటరీ ఫస్ట్" అనే సిద్ధాంతాన్ని పొగిడారు. తన దేశం బెదిరింపులకు గురికావడం అనేది ''ఇక ఎప్పటికీ జరగదు'' అన్న సమయాన్ని తీసుకొస్తానని హామీ ఇచ్చారు.
ఆయన నాయకత్వంలో ఉత్తర కొరియా అణు, క్షిపణి కార్యక్రమాలు మరింతగా ముందుకెళ్లాయి. చాలా ప్రభావవంతమైన ఫలితాలు సాధించినట్లు కనిపించాయి. మరో నాలుగు అణు పరీక్షలు జరిగాయి. వీటితో కలిపి ఉత్తర కొరియాలో జరిగిన మొత్తం అణు పరీక్షల సంఖ్య ఆరుకు చేరింది.
సూక్ష్మీకరించిన ఒక హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించామని ఉత్తర కొరియా ప్రకటించింది. ఈ బాంబును దీర్ఘశ్రేణి క్షిపణుల్లో కూడా పెట్టొచ్చని తెలిపింది. అయితే నిపుణులు మాత్రం కిమ్ జోంగ్ ఉన్ కార్యక్రమం పురోగతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఉత్తర కొరియా క్షిపణులు చేరగల దూరం కూడా పెరిగినట్లు కనిపించింది. 2017లో కిమ్ పరిపాలనలో పలు క్షిపణులను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. అమెరికాను కూడా చేరుకోగల ఒక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించామని ఉత్తర కొరియా ప్రకటించింది. దీంతో డోనల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి ఆంక్షలను పెంచింది.
ట్రంప్, కిమ్ మధ్య శతృత్వం తారా స్థాయికి చేరుకుంది. ఇరువురూ ఆవేశపూరితంగా మాటల యుద్ధానికి దిగారు.
''ఆత్మాహుతి మిషన్‌పైనున్న రాకెట్ మనిషి'' అని కిమ్‌ను ఉద్దేశించి ట్రంప్ అన్నారు. దీంతో ట్రంప్‌ను ''మతి చలించిన అమెరికా ముసలోడు'' అని కిమ్ వర్ణించారు.
అణు దాడి జరిగితే ట్రంప్ ఎక్కడ తలదాచుకుంటారు?
ట్రంప్-కిమ్ భేటీ: ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాలేవి!
Image copyrightEPA
అయితే, ఎవ్వరూ ఊహించని విధంగా, కిమ్ తన నూతన సంవత్సర ప్రసంగంలో దక్షిణ కొరియాకు స్నేహ హస్తం అందించారు. తాను ''చర్చలు మొదలు పెట్టేందుకు'' సిద్ధంగా ఉన్నానని, దక్షిణ కొరియాలో 2018 శీతాకాల ఒలంపిక్స్‌కు తమ జట్టును పంపిస్తానని అన్నారు.
అక్కడి నుంచి రాయబార కార్యకలాపాలు వాయువేగంతో జరిగిపోయాయి.
ఉభయ కొరియాలూ ఒకే జెండాతో ఒలంపిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాయి.
ఇరు దేశాల మధ్యా అత్యున్నత స్థాయి సమావేశాలు జరిగాయి.
కిమ్ రైలులో చైనా రాజధాని బీజింగ్ కూడా వెళ్లారు. ఉత్తర కొరియా పాలకుడిగా ఆయన అందరికీ తెలిసేలా చేసిన తొలి విదేశీ పర్యటన ఇదే. ఉత్తర కొరియాకు ప్రధాన మిత్రపక్షంగా, వ్యాపార భాగస్వామిగా చైనా ఉంది.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో కూడా సంబంధాలను మెరుగుపర్చుకోవాలని కిమ్ భావించారు. దీంతో 2018 ఏప్రిల్ నెలలో ఇరువురు నాయకుల మధ్య సింగపూర్‌లో చారిత్మాత్మక ముఖాముఖి చర్చలు జరిగాయి. ఉత్తర కొరియా తన అణ్వాయుధ కార్యక్రమాలను విరమించుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు చోటుచేసుకున్నాయి.
తాన అన్ని రకాల క్షిపణి ప్రయోగాలనూ రద్దు చేస్తున్నానని కిమ్ ప్రకటించారు. అలాగే, తన దేశం ''అణ్వాయుధాలను'' సాధించుకున్నందున అణు పరీక్షల కేంద్రాన్ని కూడా మూసేస్తానని చెప్పారు.
ట్రంప్-కిమ్ భేటీ: ఉత్తర కొరియాలో ఉత్సాహం.. అమెరికాలో భిన్నాభిప్రాయం
ట్రంప్-కిమ్ సమావేశం ఎందుకు విఫలమైంది?
Media captionట్రంప్-కిమ్ సదస్సు: చరిత్రాత్మక కరచాలనం వీడియో
ఈ నిలువరింపును అంతర్జాతీయ సమాజం స్వాగతించింది. అయితే, ఉత్తర కొరియా తన వద్ద ఉన్న ఆయుధాలను వదిలేస్తానని హామీ ఇవ్వలేదన్న సంగతిని పరిశీలకులు గుర్తు చేశారు. అలాగే, అంతకు ముందు కూడా ఎన్నోసార్లు అణ్వాయుధాల అభివృద్ధిని ఆపేస్తానంటూ బూటకపు హామీలు ఇవ్వటాన్ని కూడా ఎత్తి చూపారు.
రెండేళ్ల తర్వాత ట్రంప్, కిమ్ ఇద్దరూ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో కలసి.. ముందస్తు ప్రణాళికలు లేని, లాంఛనప్రాయమైన ఒక సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తర, దక్షిణ కొరియాలను వేరు చేసే నిస్సైనిక ప్రాంతం (డీఎంజెడ్)లో ఈ భేటీ జరిగింది.
అయితే, తర్వాతి కాలంలో అమెరికా, ఉత్తర కొరియాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్యాంగ్యాంగ్ పూర్తిగా తన అణ్వాయుధ కార్యక్రమాలను వదులుకుంటే తప్ప ఆంక్షలను తొలగించేది లేదని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేయడంతో చర్చలు కూడా నిలిచిపోయాయి.
అమెరికాతో చర్చల సందర్భంగా ప్రారంభమైన అణు, దీర్ఘశ్రేణి క్షిపణి పరీక్షల నిలిపివేతను రద్దు చేస్తున్నట్లు 2020 జనవరిలో కిమ్ ప్రకటించారు. ''ప్రపంచం ఒక సరికొత్త వ్యూహాత్మక ఆయుధాన్ని చూస్తుంది'' అని బెదిరించారు.
ఉత్తర కొరియాకు మిత్రదేశాలు ఎన్ని?
'ఉత్తర కొరియా జైలులో నేను శవాల్ని పూడ్చిపెట్టాను'
Image copyrightAFP
చిత్రం శీర్షిక
కిమ్, రి లకు ముగ్గురు పిల్లలు ఉన్నారని అంతా భావిస్తుటారు (2018 మర్చి 27వ తేదీన బీజింగ్ లో తీసిన ఫొటో)
కిమ్ కుటుంబం
కిమ్ తరచుగా తన రక్షణ శాఖ మంత్రులను మారుస్తుంటారు. 2011 నుంచి ఇప్పటి వరకూ కనీసం ఆరుగురు వ్యక్తులు ఈ పదవిలో ఉన్నారు. సైన్యం విధేయత పట్ల కిమ్‌కు విశ్వాసం లేదనేందుకు ఇదే సంకేతమని విశ్లేషకులు భావిస్తుంటారు.
కిమ్ జోంగ్ ఉన్ తన మామ చాంగ్ సాంగ్ థేక్‌ను ఉరితీయాలని 2013 డిసెంబర్‌లో ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉత్తర కొరియా అత్యున్నత వర్గంలో అంతర్గత అధికార పోరాటానికి అదే పెద్ద సంకేతం. ఆయన కిమ్ అధికారాన్ని కూలదోయడానికి కుట్రపన్నారని ప్రభుత్వ మీడియా చెప్పింది.
ప్రవాసంలో ఉన్న తన సవతి సోదరుడు కిమ్ జోంగ్ నామ్‌ను హత్య చేయాలని కిమ్ ఆదేశాలిచ్చారని అంతా అనుకుంటుంటారు. కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2017 ఫిబ్రవరిలో నామ్ హత్యకు గురయ్యారు.
కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అందుకు కారణం ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచారు.
ఓ కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్‌తో ఓ మహిళ ఉన్న ఫుటేజ్‌ని ఒక టీవీ చానల్ చూపించే వరకు అసలు ఎవరికీ కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితం గురించి తెలియదు.
2012 జూలైలో ప్రభుత్వ మీడియా కిమ్ జోంగ్ ఉన్ కామ్రేడ్ రి సోల్ జుని పెళ్లి చేసుకున్నారని ప్రకటించింది.
ఉత్తర కొరియా చుక్క పెట్రోల్ కోసం తల్లడిల్లాల్సిందే!
ఉత్తర కొరియాకు ఇంటర్నెట్ సేవలు ఎక్కడి నుంచి అందుతున్నాయి?
Image copyrightAFP
చిత్రం శీర్షిక
కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ కొరియా కార్మికుల పార్టీలో ఉన్నత పదనిలో ఉన్నారు
ఆమె గురించి, ఆమె కుటుంబం గురించి కూడా ఎలాంటి వివరాలు బయటపడలేదు. చివరికి ఆమె వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ కట్ ఆధారంగా ఆమె ఎగువ తరగతి కుటుంబానికి చెందిన మహిళగా విశ్లేషకులు అంచనా వేశారు.
రి సోల్ జు ఒక గాయకురాలని, ఓ ప్రదర్శనలో కిమ్ జోంగ్ ఆమె పట్ల ఆకర్షితులయ్యారని అంటారు.
కిమ్ జోంగ్, రి సోల్ పెళ్లికి సంబంధించి మరిన్ని వివరాలు ఎవరికీ తెలియవు.
దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారాన్ని బట్టి, ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాలో ఉన్నతస్థాయి పదవిలో ఉన్నారు. శీతాకాల ఒలంపిక్స్ సందర్భంగా తన సోదరుడితో కలసి దక్షిణ కొరియాకు వచ్చినప్పుడు ఆమె అందరి దృష్టినీ ఆకర్షించారు.
కాగా, కిమ్ జోంగ్ ఉన్న అన్న కిమ్ జోంగ్ చోల్ ఏదైనా అధికారిక పదవిలో ఉన్నారా, లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
ఇవి కూడా చదవండి:
దక్షిణ కొరియాలో తనిఖీలు చేస్తున్న కిమ్ జోంగ్ ‘మాజీ ప్రియురాలు’

‘విదేశాలకు వెళ్లాలంటే వీసా చాలు.. ఉత్తర కొరియా వెళ్లాలంటే ధైర్యం కూడా కావాలి’
ట్రంప్ ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?
కొరియా సంభాషణలు: ఎలా జరుగుతాయి? ఏం చర్చిస్తారు?
కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యంపై ఎందుకీ వదంతులు... 'బ్రెయిన్ డెడ్' వార్త నిజమేనా?
ఉత్తర కొరియా: కిమ్ జాంగ్ ఉన్ మేనత్త బతికే ఉన్నారు... ఆరేళ్ళ ఊహాగానాలకు తెర
కరోనావైరస్: కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియాలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఏం చేశారు?
కిమ్‌కు ఇచ్చే విందులో ఈ పదార్థంపై జపాన్‌కు అభ్యంతరమెందుకు?
ఉత్తరకొరియాకు ప్రపంచ దేశాల మద్దతు అవసరం: రష్యా అధ్యక్షుడు పుతిన్
డీఎంజెడ్ వద్ద చరిత్రాత్మక భేటీ.. వైట్‌హౌస్‌కు రావాలని కిమ్‌ను ఆహ్వానించిన ట్రంప్
ట్రంప్-కిమ్: గతంలో ఇలా తిట్టుకున్నారు
9 మార్చి 2018

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను కలిసి మాట్లాడటానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ఈ విషయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. వాళ్లిద్దరూ స్నేహపూర్వక బంధం దిశగా అడుగేస్తున్నా, గతంలో వాళ్లిద్దరూ ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు, అవమానాలు కూడా తెరమీదకొస్తున్నాయి.
‘రాకెట్‌మ్యాన్’, ‘డొటార్డ్’(ముసలివాడు).. లాంటి పదాలతో గతంలో ఒకరికొకరు తిట్టుకున్నారు.
గత సెప్టెంబరులో కిమ్ జోంగ్ ఉన్ ‘డొటార్డ్’ అని ట్రంప్‌ని ఉద్దేశిస్తూ ఓ ప్రసంగంలో అన్నారు. ఆ మాట ఏంటో అర్థం కాక చాలామంది డిక్షనరీలను వెతుకున్నారు. దానర్థం ‘మానసికంగా, శారీరకంగా వృద్ధుడైన వ్యక్తి’ అని తెలుసుకొని అంతా అవాక్కయ్యారు.
Image copyrightTWITTER
ట్రంప్ గతేడాది ఐక్య రాజ్య సమితి సమావేశంలో చేసిన ప్రసంగానికి కిమ్ స్పందిస్తూ, ‘అతడు ఏదో ఒక రోజు ఉత్తర కొరియాను పూర్తిగా నాశనం చేస్తాడు’ అన్నారు.
తమ అధ్యక్షుడే ట్రంప్‌ను అంత మాట అనడంతో ఉత్తర కొరియా మీడియా మరో అడుగు ముందుకేసింది. ‘విషపూరిత పుట్టగొడుగు’, ‘పురుగు’, ‘గ్యాంగ్‌స్టర్’, ‘దోపిడీదారుడు’, ‘డొటార్డ్’, ‘ర్యాబిస్ కుక్క’, ‘ల్యునాటిక్’ లాంటి పదాలను ప్రయోగిస్తూ ట్రంప్‌పై ఉ.కొరియా మీడియా విరుచుకుపడింది.
ఉత్తర కొరియాలో కిమ్‌ని గానీ, అతడి కుటుంబ సభ్యుల్ని గానీ ఎవరైనా తిడితే వారికి మరణ శిక్ష విధిస్తారు.
‘నేను ముసలోడినైతే.. మరి నువ్వు ___!’
ట్రంప్ ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?
Image copyrightKOREAN CENTRAL NEWS AGENCY
‘ట్రంప్ పొలంలో ఓ పురుగు, ఓ విషం నిండిన పుట్టగొడుగు, మానసిక సమస్యతో ఉన్న ముసలివాడు’ అని ఉత్తర కొరియాకు చెందిన కేసీఎన్‌ఏ అనే న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
‘అతడెన్నో లోపాలతో నిండిన మనిషి, ఓ రాజకీయ పోకిరి, దోపిడీదారు, మానసికంగా ఎదగని వ్యక్తి’ అని గత సెప్టెంబర్ 23న ఉత్తర కొరియా ప్రభుత్వ పత్రిక ‘రోడొంగ్ సిన్మన్’ రాసుకొచ్చింది.
‘ముసలివాడు’ అంటూ తనను ఉద్దేశిస్తూ ఉత్తర కొరియా మీడియా చేసిన వ్యాఖ్యలకు ట్రంప్ కూడా స్పందించారు. ‘నేనెప్పుడైనా కిమ్‌ని పొట్టివాడు, దొబ్బోడు అని అన్నానా’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
Image copyrightTWITTER
ట్రంప్ గతంలో తన దగ్గర కూడా న్యూక్లియర్ బటన్ ఉందని ట్వీట్ చేసినప్పుడు, ‘రోడంగ్ సిన్మన్’ పత్రిక ఘాటైన వ్యాఖ్యాలు చేసింది. ‘సైకోపాత్’, ‘నిర్లక్ష్యం నిండిన వెర్రివాడు’, ‘లూజర్’ అని ప్రచురించింది. అతడి వ్యాఖ్యలను ర్యాబిస్‌తో బాధపడే కుక్క అరుపులతో పోల్చింది.
ట్రంప్ మానసిక పరిస్థితి ప్రపంచానికి పెద్ద తలనొప్పిలా మారిందనీ, అమెరికా న్యూక్లియర్ బటన్ ఓ పిచ్చివాడి చేతిలో ఉందనీ ‘రోడంగ్ సిన్మన్’ పేర్కొంది.
‘అతడు మనిషి కాదు, ఓ గ్యాంగ్‌స్టర్ల నాయకుడు, ఓ కుక్క’ అని కేసీఎన్‌ఏ వ్యాఖ్యానించింది.
ఇలాంటి పరిణామాల అనంతరం ట్రంప్, కిమ్ కలుసుకోవడానికి ఒప్పుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మరి వాళ్లిద్దరూ మే నెలలో ఒకరికొకరు ఎదురుపడ్డప్పుడు ఎలా మాట్లాడుకుంటారో చూడాలి.
(ప్రపంచవ్యాప్తంగా టీవీ, రేడియో, వెబ్, ప్రింట్ మీడియాలో వచ్చే వార్తలను, నివేదికలను బీబీసీ మానిటరింగ్ విశ్లేషిస్తుంది. ట్విటర్, ఫేస్‌బుక్‌లలో బీబీసీ మానిటరింగ్‌ను అనుసరించొచ్చు.)
కిమ్ జోంగ్ ఉన్: ఈయన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఉత్తర కొరియా అధ్యక్షుడయ్యారా?
8 జనవరి 2018

కిమ్ జోంగ్ ఉన్ అధ్యక్ష పదవితోపాటు ఎన్నో అధికారిక పదవులను స్వీకరించారు
కిమ్ జోంగ్ ఉన్ పేరే సంచలనం. ఆయన ఏం చేసినా.. ఏం మాట్లాడినా అంచనాలకు మించి సంచలనాలు సృష్టిస్తారు. ఉన్ ఉత్తర కొరియా అధ్యక్షుడవడం కూడా ఓ సంచలనమే. నేడు (జనవరి 8) ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి పలు ఆసక్తికర అంశాలు.
తండ్రి, ఉత్తర కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ 2011 డిసెంబరు 17వ తేదీన మరణించడంతో చిన్నకొడుకైన కిమ్ జోంగ్ ఉన్‌ను ఈ పదవి వరించింది.
తండ్రి మరణం తర్వాత కేవలం పదిహేను రోజుల్లోనే పార్టీ అధ్యక్షుడిగా, దేశ సైన్యాధిపతిగా, తండ్రికి తగ్గ తనయుడని గుర్తింపు పొందారు.
కిమ్ జోంగ్ ఉన్‌కు ప్రపంచంలో అత్యంత భయంకరమైన నియంత అనే పేరుంది. ఆయన ఎప్పుడు ఎలాంటి ప్రకటన చేస్తారో, ఏ ప్రయోగం చేస్తారో ఎవరికీ అర్ధం కాదు.
2016 జనవరిలో ఆయన భూగర్భ హైడ్రోజన్ బాంబు పరీక్ష మొదలుపెడుతున్నానని ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్ధితి సృష్టించారు.
ఓ వైపు ఐక్యరాజ్యసమితి ఆంక్షలు, మరోవైపు అగ్రరాజ్యం అమెరికా ఒత్తిడి.. అయినా ఎక్కడా ఒత్తిళ్లకు తలొగ్గకుండా దూకుడును కొనసాగించే కిమ్ జోంగ్ ఉన్ తన మేనమామనే వదల్లేదు.
రాజకీయంగా తనపై కుట్ర చేస్తున్నారంటూ 2013లో ఆయనను ఉరితీసి సంచలనం రేకెత్తించారు.
Image copyright-
కిమ్ జోంగ్ ఉన్ ముగ్గురు కొడుకుల్లో అందరికంటే చిన్న కొడుకు. ఆయన 1983 లేదా 1984 లో జన్మించారు. ఆయన తండ్రికి వారసుడిగా దేశాధ్యక్షుడవుతాడని ఎవరూ అనుకోలేదు.
అందరూ అతడి సోదరులు కిమ్ జోంగ్ నామ్, లేదా కిమ్ జోంగ్ చొల్ లో ఎవరో ఒకరు అవుతారని అనుకున్నారు. కానీ కిమ్ జోంగ్ ఉన్ 27 ఏళ్లకే ఉత్తర కొరియా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.
ఇంతకీ కిమ్ జోంగ్ ఉన్‌ని 27 ఏళ్లలోపే అంత పెద్ద పదవి ఎలా వరించింది? ఇద్దరు సోదరులు రాజకీయంగా బలహీనంగా ఉండటం వల్లనే కిమ్ జోంగ్ ఉన్ తండ్రి పదవిని అధిష్టించారని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు.
అంతకుముందు ఆయన ఉత్తర కొరియా ప్రభుత్వంలో పలు కీలక పదవులు నిర్వహించడం కూడా కలిసివచ్చిందని అంటారు.
ఆంక్షలకు లొంగేది లేదు: ఉత్తర కొరియా
అమెరికా: ఉత్తర కొరియాకు యుద్ధమే పరిష్కారం కాదు
Image copyrightSAUL LOEB
స్విట్జర్లాండ్‌లో చదువుకున్న కింగ్ జోంగ్ ఉన్ మాత్రం ఎప్పుడూ పాశ్చాత్య ప్రభావాలకు లొంగలేదు.
యూరోపియన్లతో ఎక్కువగా కలిసేవారు కాదు. అప్పట్లో ఆయన స్కూల్ నుండి తిరిగి వచ్చి ఉత్తర కొరియా రాయబారితో కలిసి భోజనం చేసేవారు.
అక్కడి నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో కిమ్ II సాంగ్ మిలిటరీ యూనివర్సిటీలో చేరారు.
Image copyrightSTR
"మార్నింగ్ స్టార్ కింగ్"
కిమ్ జోంగ్ ఉన్ తల్లి కో యోంగ్ హుయి, తండ్రికి ప్రియమైన భార్య. ఆమె కిమ్ జోంగ్‌ను ప్రేమానురాగాలతో పెంచారు. ఆమె అతన్ని ’’మార్నింగ్ స్టార్ కింగ్" అని పిలిచేవారు.
2003లో ఒక జపాన్ రచయిత "ఐ వజ్ కిమ్ జోంగ్ ఇల్స్ చెఫ్ " అనే పుస్తకంలో కిమ్ జోంగ్ ఉన్‌ను అతడి తండ్రి ముగ్గురు కొడుకుల్లో ఎక్కువగా ప్రేమించేవారాని తెలిపాడు.
2010 ఆగస్టులో ఉన్ తన తండ్రితో కలిసి చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు దక్షిణ కొరియాకు చెందిన ఓ టీవీ చానల్.. కిమ్ జోంగ్ ఉన్ తండ్రి వారసుడని ఒక వార్తలో పేర్కొంది.
కిమ్ జోంగ్ ఉన్ పోలికలు ఉత్తర కొరియా వ్యవస్ధాపకుడు కిమ్ II సంగ్ లాగా ఉన్నాయని, అందుకే ఆయన అధికారానికి వారసుడయ్యాడని కొన్ని కథనాలు పేర్కొన్నాయి.
అయితే తనలో తాత పోలికలను మరింత స్పష్టంగా చూపించేందుకు ఉన్ ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకున్నారని కొందరు అంటారు.
మొదటి బహిరంగ ప్రసంగం
కిమ్ II సంగ్ 100వ జయంతి సందర్భంగా 15 ఏప్రిల్ 2012 లో కిమ్ జోంగ్ ఉన్ మొదటిసారి బహిరంగ ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో ఉత్తర కొరియా బెదిరింపులకు గురవుతోందంటూ.. దేశ రక్షణ కోసం "మిలిటరీ ఫస్ట్" అనే నినాదమిచ్చారు.
సైనిక సాంకేతికతపై ఆధిపత్యం సామ్రాజ్యవాద దేశాలకు మాత్రమే పరిమితం కాదని తమ దేశ సైన్యం కూడా సాంకేతికతలో ముందుండాలని పేర్కొన్నారు.

కిమ్ జోంగ్ ఉన్, ఆయన భార్య ఇద్దరూ కలిసి 2012 ఓ సారి ప్రజల మధ్యలో వచ్చారు
వ్యక్తిగత జీవితం పూర్తిగా గోప్యం

ఓ కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్‌తో ఓ మహిళ ఉన్న ఫుటేజ్‌ని ఒక టీవీ చానల్ చూపించే వరకు అసలు ఎవరికీ కిమ్ జోంగ్ ఉన్ వివాహ జీవితం గురించి తెలియలేదు.
జూలై 2012లో ఆ దేశ మీడియా కిమ్ జోంగ్ ఉన్ కామ్రేడ్ రి సోల్ జుని పెళ్లి చేసుకున్నారని తెలిపింది.
ఇంతకీ రి సోల్ జు ఎవరు?

కిమ్ జోంగ్ ఉన్‌కు ఆమె అన్ని విధాలా సరియైన జోడీ అని పరిశీలకులు అంటారు.
కొందరయితే రి సోల్ జు ఒక గాయకురాలని, ఓ ప్రదర్శనలో కిమ్ జోంగ్ ఆమె పట్ల ఆకర్షితులయ్యారని అంటారు. కిమ్ జోంగ్, రి సోల్ పెళ్లికి సంబంధించి మరిన్ని వివరాలు ఎవరికీ తెలియవు.
అధికారిక కార్యక్రమాలే కాకుండా ఈ జంట అమ్యూజ్మెంట్ పార్క్‌లో ఓ సారి, డిస్నీ చానల్ ప్రదర్శనలో ఓ సారి పాల్గొంది. వీరు జనాల మధ్యలోకి వచ్చింది చాలా తక్కువ.
‘వన్నాక్రై సైబర్ దాడి చేసింది ఉత్తర కొరియానే’
దక్షిణ కొరియాతో చర్చలకు అంగీకరించిన ఉత్తర కొరియా
Image copyrightGETTY IMAGES
చిత్రం శీర్షిక
2013 ఫిబ్రవరిలో ఉత్తర కొరియా మూడో అణు పరీక్ష నిర్వహించింది
కిమ్ జోంగ్ ఉన్‌కు ఎంతమంది పిల్లలున్నారు?
ఈ విషయం కూడా తెలియదనే చాలా మంది చెప్తారు. అమెరికా బాస్కెట్ బాల్ క్రీడాకారుడు డెన్నిస్ రాడ్ మాన్ 2013, 2014ల్లో కిమ్ జోంగ్ ఉన్‌ను కలిశారు. డెన్నిస్ రాడ్ మాన్ గార్డియన్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిమ్ జోంగ్‌కు ఒక కూతురుందని తెలిపారు.
అయితే, ఈ మధ్యనే ఆయనకు మూడో సంతానం కలిగినట్టు వార్తలు వెలువడ్డాయి.
అంతర్జాతీయ ప్రతిస్పందన
2012లో కిమ్ జోంగ్ ఉన్ ఉన్నత స్థాయి సైనిక పునర్వ్యవస్థీకరణ జరిపారు. అందులో భాగంగా ఆయన అప్పటి ఆర్మీ చీఫ్ రి యోంగ్ హోను సైనికాధిపతి పదవి నుంచి తొలగించి అత్యున్నత సైనిక పదవి "మార్షల్"ని అధిష్టించారు.
ఈ చర్య అప్పట్లో అంతర్జాతీయ స్ధాయిలో దుమారం రేపింది. పలు దేశాలు ఈ చర్యను ఖండించాయి.
ప్రపంచ దేశాల హెచ్చరికలను, ఆంక్షలను లెక్క చేయకుండా పలు దఫాలుగా క్షిపణుల ప్రయోగంతో కిమ్ జోంగ్ ఉన్ ఎన్నో వివాదాలను సృష్టించారు.

Image copyrightHANDOUT
2012 ఏప్రిల్ తర్వాత ఉత్తర కొరియా ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు రాకెట్‌ని ప్రయోగించింది. ఆ ప్రయత్నం విఫలమైంది. పలు దేశాలు ఇలాంటి ప్రయోగాలను నిషేధించాలని డిమాండ్ చేశాయి.
ఆ తరువాత 2012 డిసెంబర్‌లో ఉత్తర కొరియా మూడు దశల రాకెట్ టెక్నాలజీతో అంతరిక్షంలో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టింది. అప్పుడు కూడా జపాన్, అమెరికాలు ఉత్తర కొరియాపై మండిపడ్డాయి.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉత్తర కొరియా చర్యను ఖండిస్తూ, ఆంక్షలను మరింత కఠినతరం చేసింది.
2013 ఫిబ్రవరిలో ఉత్తర కొరియా మూడో అణు పరీక్షను చేపట్టింది. ఆ పరీక్ష 2009లో చేసిన పరీక్ష కన్నా రెండు రెట్లు పెద్దది. దీంతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉత్తర కొరియా పై తాజాగా ఆంక్షలు విధించింది.
ఉత్తర కొరియా క్రీడా చరిత్ర: ఒకసారి బాంబులు.. మరోసారి రాయబారాలు
అది మీ తాత కలలు కన్న స్వర్గం కాదు: కిమ్‌కు ట్రంప్ వార్నింగ్
Image copyrightSTR
ఉత్తర కొరియా రాకెట్ ప్రయోగాలపై దక్షిణ కొరియా విసుగు చెందింది. రెండు దేశాల మధ్య అగాధం మరింత పెరగడంతో 2013 ఏప్రిల్‌లో ఉభయ దేశాలు సంయుక్తంగా నడిపే కైసాంగ్ వాణిజ్య పార్క్‌ను మూసేస్తున్నట్టు దక్షిణ కొరియా ప్రకటించింది. కానీ అదే ఏడాది సెప్టెంబరులో రెండు దేశాల మధ్య చర్చలు సఫలమవడంతో ఆ వాణిజ్య పార్క్‌ను తిరిగి తెరిచారు.
2016 జనవరిలో ఉత్తర కొరియా తన మొట్ట మొదటి భూగర్భ హైడ్రోజన్ బాంబు పరీక్షను విజయవంతంగా నిర్వహించిందని తెలిపింది. దీంతో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది.
పలుదేశాలు ఈ పరీక్షపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఉత్తర కొరియా ఈ పరీక్షతో ఆధునిక అణు సామర్ధ్యం తనకుందని ప్రకటించుకుంది.
తన మేనమామ చాంగ్ సాంగ్‌ను విధుల నుంచి తొలగించడంపై పలుదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఉత్తర కొరియాకు గుండెకాయ వంటి నేషనల్ డిఫెన్స్ కమిషన్ వైస్ ఛైర్మన్‌గా చాంగ్ సాంగ్ ఉండేవారు.
ఆయనను ఉరి తీయడంపై కిమ్ జోంగ్ ఉన్ 2014 జనవరి 1వ తేదీన బహిరంగ ప్రకటన చేస్తూ ముఠా మురికిని తుడిచేశామని చెప్పారు.

Comments
Post a Comment